.

******************************స్వాగతమ్==========సుస్వాగతమ్****************

.

.
************************************************************************************************************************************************************************========================================================================================================================

....ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్|

....భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|

.......................................................... న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్


................................. భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు - ఆర్యోక్తి


*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*

************************************************************************************************************************************************************************

.

*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*

************************************************************************************************************************************************************************

గోచారరీత్యా మూర్తివంత ఫలనిర్ణయం చేయువిధానం

పంచాంగములో "గ్రహప్రవేశాల" గురించి ప్రస్తావన ఉంటుంది. అనగా గ్రహాలన్నీ ప్రస్తుతం ఉన్న స్థితిని, భవిష్యత్తులో ఆ ఏడాది గ్రహాల చలన మార్పులను "నక్షత్ర పాద సంఙల" రూపంలో పేర్కోటారు. వీటిని బట్టే ఒక రాశివార్కి ఫలానా గ్రహం బాగున్నదనీ, ఫలానా గ్రహం బాగోలేదనీ నిర్ణయించడం జరుగుతుంది. అది లోహముల పరిభాషలో ఉంటుంది. తద్వారా ఫలితాల నిర్ణయం సులభతరం అవుతుంది.

 

జన్మరాశి లేక నామనక్షత్ర రాశినుండి గ్రహము ప్రవేశించే కాలానికి ఉన్న నక్షత్రరాశి వరుకూ (నక్షత్ర పాదాన్ని కూడా పరిగణలోకి తీసుకొని) లెక్కించాలి.

 ఇలా వచ్చిన రాశినిబట్టి

1-6-11 లలో ఉంటే సువర్ణమూర్తిగానూ, 

2-5-9 లలో ఉంటే రజితమూర్తిగానూ, 

3-7-10 లలో ఉంటే తామ్రమూర్తిగానూ, 

4-8-12 లలో ఉంటే లోహమూర్తిగానూ 

నిర్ణయిస్తారు. గ్రహ సంచారాన్ని బట్టి సువర్ణ, రజిత మూర్తిగా ఉన్న గ్రహము చక్కటి శుభఫలితాలనిస్తుందనీ, తామ్రమూర్తిగా ఉన్న గ్రహము మధ్యమ ఫలితాలనిస్తుందనీ, మరియు లోహమూర్తిగా ఉన్న గ్రహం దోషము కలిగి చెడుఫలితాలనిస్తుందనీ తెలుసుకోవలెను.