అందరికీ నమస్కారం..!! మీకివే మా స్వాగత సుమాంజలులు..
'ఈ బ్లాగుకు విచ్చేసిన జ్యోతిష్యశాస్త్ర పాఠకులకు, అభిమానులకు, జ్యోతిష్యశాస్త్ర విద్యార్ధులకు ముందుగా మా కృతజ్ఞతలు.'
ఎన్నోవేల సంవత్సరాల క్రితమే పుట్టిన చతుర్వేదాలలో మొదటి భాగమైన ఋగ్వేదమునందు సంహితభాగమునజ్యోతిష్యం గురించిన ప్రస్తావన వున్నది. సూర్యుడు, గ్రహములు, నక్షత్రములకు సంబందించిన అనేకవిషయాలు చాలావిపులముగా కధలుగా మన పురాణాలో నిక్షిప్తం చేయబడ్డాయి. ప్రత్యక్ష దైవం కర్మ సాక్షి అయిన ఆ సూర్య భగవానుడ్నిఆధారముగా భావించి ఈ విశ్వము గురించిన ఎన్నో రహస్యాలను, సూక్ష్మాతిసూక్ష్మ సిద్ధాంతాల నుమానవాళికి అందించిన శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, వరాహమిహిరుడు భాస్కరాచార్యవంటి మహానుభావులు పుట్టింది మనభారతదేశంలోనే. ఖగోళశాస్త్రం ఆధారంగానే జ్యోతిష్య శాస్త్రం ఏర్పడింది. జ్యోతిష్యశాస్త్రానికి సంభందించిన మూలగ్రంధాలు చాలామటుకు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ పరాశరసంహిత, కాశ్యప సంహిత, పంచసిద్ధాంతిక, బృహత్సంహిత వంటి మొదలైన గ్రంధాల ఆధారంగా నేటికీ జ్యోతిష్య శాస్త్రం తన ప్రాబల్యాన్ని చాటిచెబుతోంది. జ్యోతిష్యం లేక జోస్యం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విశ్వసించేవిధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మశాస్త్రము. మనిషిజీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీరలక్షణాలు, అరచేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీన శాస్త్రాలలో ఇది కూడాఉంది. హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. ఈ జన్మ సిద్దాంతం ప్రకారం పూర్వజన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలోనూదానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవిజననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహ స్థితిలో జీవి జననం జరుగును. ఇదిఅంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతిజీవి భూతభవిష్యత్వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము. అందుకే భారతదేశం యుగయుగాలుగా పుణ్యభూమిగా, కర్మభూమిగా వెలుగొందుతున్నది.
* దీనికి కర్త ఒకడుంటే అతడెలంటివాడు?
* అతనికీ ఈ సృష్టికీ ఉన్న సంబంధమెలాంటిది?
* మరణానంతరం మనిషి స్థితి ఏమిటి?
* జన్మకు పూర్వం మనం ఎక్కడున్నాం?
ఈ భూగోళం మీద మనిషి పుట్టిన దగ్గర నుండీ అతని బుర్రను తొలిచివేస్తున్న ప్రశ్నలివి. మహా మేధావులు కూడా వీటికి సరియైన సమాధానాలు చెప్పినా అవి ఊహాపోహలే తప్ప ప్రత్యక్ష ప్రమాణాలు కావు. కానీ కొంతమంది తత్త్వవేత్తలు తమ శుద్దమనస్సుతో చూచి కొన్ని సమాధానాలు కనుగొని మనకు అందించారు. ఆ సమాధానాలు పొందుపరచబడిన గ్రంధాలే మనకు వేదాలు. సాధారణ తామసిక మనస్సుల కందని సత్యాలను ప్రకాశింప చేసేవే శాస్త్రాలని హిందువుల విశ్వాసం. అటువంటి శాస్త్రాలలో ఒకటి ఈ జ్యోతిష్యశాస్త్రం. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కొన్ని వందల శతాబ్ధాలతరబడి ఏమాత్రం చెక్కుచెదరకుండా ఇంతలా ఒకశాస్త్రం తన మనుగడ సాగిస్తోందీ అంటే అది చాలా గొప్ప విషయంగా చెప్పక తప్పదు. కేవలం ఎవరో ఋషులు చెప్పారని ఇన్నివందల సంవత్సరాలుగా ఒక విషయాన్ని మనం కొనసాగించలేము కదా! ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ మనకీ మానవజన్మ లభించదు. అందునా గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారతదేశంలోపుట్టడం నిజంగా మనఅదృష్టం. ఇక్కడి గాలిపవిత్రం, నీరుపవిత్రం. ఇక్కడ అనాదిగావస్తున్న ఆచారసాంప్రదాయాలతో భారతదేశ ప్రజలు సాగిస్తున్న జీవనశైలి ఇతరదేశాల వారికి ఎంతో ఆదర్శప్రాయమైనది. ఆధ్యాత్మిక ఙానాన్ని, ఖగోళ విఙానాన్ని ప్రపంచానికి అందించిన ఒక గొప్ప దేశములో పుట్టినందుకు మనమంతా గర్వపడాలి.
ఇంతకీ జ్యోతిష్యం అంటే ఏమిటీ?
జ్యోతిశ్
అనగా ప్రకాశవంతమైనది అని అర్ధం. జ్యోతిషశాస్త్రం అనేది అనేక వ్యవస్థలు,
సంప్రదాయాలు, విశ్వాసం సమాహారం, ఇందులో ఖగోళవస్తువుల స్థితిగతులను మరియు
అనుబంధ వివరాలను ఉపయోగించి వ్యక్తిత్వం,మానవ సంబంధాలు, ఇతరభూగోళ విషయాలకు
సంబంధించిన సమాచారాన్ని తెలియజేయు శాస్త్రం. జ్యోతిష్యశాస్త్రాన్ని
ఆంగ్లములో 'ASTROLOGY' అని అంటారు.పురాతన గ్రీకు భాషలో astron, అంటే 'నక్షత్రరాశి, నక్షత్రం' మరియు logia,
అంటే 'గురించి అధ్యయనం' అని అర్ధం. భవిష్యత్తు ఎలాఉంటుందో
తెలుసుకోవాలన్నఆకాంక్ష ప్రతివ్యక్తిలోనూ ఉంటుంది. జీవితంలో జరిగే
మంచిచెడులను తెలుసు కునేందుకు జ్యోతిష్కులను ఆశ్రయిస్తుంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా
చెబుతుండగా, ఇంకొందరు సంఖ్యా శాస్ర్తాన్ని ఆధారంగా చేసుకుని, మరికొందరు
గ్రహ సంచారాల ఆధారంగా జాతకాలు చెబుతుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా
చెప్పేది హస్త సాముద్రికం కాగా గ్రహ గతుల ఆధారంగా చెప్పేది జన్మ కుండలి
ఆధారిత జ్యోతిష్యం. జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసు కునేందుకు వ్యక్తి
పుట్టినతేదీ ( నెల,సంవత్సరంతో సహా), సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి.
ఇవన్నీ కచ్చితంగా ఉంటే జాతకం కూడా కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది.
జననసమయం సరిగాఉండాలి. ఇదేలగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని
బట్టే ఫలితాలు నిర్ధారించడం
సాధ్యమవుతుంది. అలాగే, లగ్నంఖచ్చితంగా నిర్ధారించేందుకు పుట్టిన ప్రదేశం
కూడా ముఖ్యమే. సూర్యోదయ సమయాలు ఆయా ప్రాంతాలను బట్టి కొన్ని నిమిషాలు
హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా లగ్ననిర్ణయం చేయాల్సిఉంటుంది. మేషాది
మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ప్రమాణం సుమారు రెండు గంటల వరకు
ఉండవచ్చు. ఒక్కోసారి నిమిషాల తేడాలో లగ్నం మారవచ్చు. పుట్టిన
ప్రదేశం తెలుసుకోవడం ద్వారా లగ్నంలోతేడాలు రాకుండా చూసే అవకాశముంటుంది.
కొందరికి పుట్టిన తేదీ, సమయాలు తెలియవు. వారి పెద్దలు చెప్పే కొండ
గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి
నిర్ధారించవచ్చు.అయితే జన్మ కుండలివేయడం వల్ల సాధ్యం కాదు. కేవలం రాశి
ద్వారా ఫలితాలు తెలుసు కోవచ్చు, లేదా "ప్రశ్న" ద్వారా తెలుసు కోవచ్చు.
ఇంకా జ్యోతిష్యశాస్త్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి తప్పకుండా ఈబ్లాగు మీ అందరికీ అందుబాటులో ఉండగలదని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భారతదేశ విజ్ఞానంలో మొదటిమెట్టుగా భావించే జ్యోతిష్యశాస్త్ర సుగంధపరిమళాలను అందరికీ అందుబాటులోకి తేవాలనే నా ఈ ప్రయత్నంలో పొరబాటుగా ఏవైనా తప్పులు దొర్లితే విజ్ఞులు సరిదిద్ది తెలియపరచాలని కోరుకుంటూ, అందరికీ శ్రీ గాయత్రీమాత ఆశీస్సులు తప్పకలభించి
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తూ..
శ్రీ గాయత్రి కంప్యూటర్ జ్యోతిష్యాలయం ......D.NO:4-10/1,..గాంధీబొమ్మదగ్గర,.పాతపోస్టాఫీసువీధి…ద్రాక్షారామ,..రామచంద్రాపురం..మండలం,తూ||గో||జిల్లా -533262 (AP)
*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*
************************************************************************************************************************************************************************
ముఖ్య గమనిక
ఈ బ్లాగుని అనుసరిస్తున్నందుకు మీకివే మా కృతజ్ఞతలు.
==> దయచేసి గమనించండి <==
మీరు వెతుకుతున్న లేదా ప్రయత్నించిన లింక్ ఇంకా నిర్మింపబడలేదు.
మీరు ఈ బ్లాగులోని పోస్టులని తప్పకుండా ఫాలో అవ్వాలనుకుంటున్నారా..?
అయితే ఈ క్రింద చూపించిన లింకుకి వెళ్ళి మీ వివరాలను ఎంటర్ చేసి రిజిష్ట్రేషన్ చేసుకోగలరు.
మీ పూర్తి జీవిత జాతక ఫలితములను రెమిడీస్ తోబాటు,
ప్రస్తుత సంవత్సర వర్షజాతక ఫలితములు (సూక్ష్మంగా తెలుపుట),
మీ చిన్నారులకు జాతకరీత్యా అద్భుతమైన పేర్లు నిర్ణయించుట,
మీకు ప్రస్తుత జాతక స్థితిననుసరించి సరిపడు జాతి రత్న నిర్ధారణ,
మీ పేరు జనన తేదీ అనుసరించి సంఖ్యాశాస్త్ర పరంగా పూర్తి వివరణ,
మీకు సరిపడు అదృష్ట రంగులు, అదృష్ట దిశ వంటి అనుకూల అంశాలను,
వధూవరుల జాతక పరిశీలన రీత్యా వివాహం చేయవచ్చునా-చేయకూడదా,
లాంటి విషయాలను తెలియజేయడంతోబాటు, మీకు కావలసినచో
వివాహాది శుభకార్యములకు ముహూర్తములను నిర్ణయించగలము.
వివరములకు సంప్రదించగలరు.
*********************************************************************************************
మీ యొక్క విలువైన అభిప్రాయాలను, సలహాలను తప్పక తెలియజేయగలరు